SSC GD Result 2025 Release Date : కానిస్టేబుల్ మెరిట్ కట్ ఆఫ్ మార్కులు

SSC GD Constable Result 2025 Release Date

SSC GD Result 2025 Release Date, SSC GD Constable Result 2025 Release Date: 2025లో SSC ద్వారా నిర్వహించిన GD కానిస్టేబుల్ CBT పరీక్షలో పాల్గొన్న అభ్యర్థులందరూ ఇప్పుడు ఫలితాల కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ పరీక్ష 4వ తేదీ నుండి 25వ తేదీ వరకు వివిధ రోజుల్లో నిర్వహించబడింది. పరీక్ష ముగిసిన తర్వాత SSC GD ఫలితాన్ని త్వరలో విడుదల చేయనుంది.

ఫిబ్రవరిలో పరీక్ష పూర్తవడంతో, సాధారణంగా ఒక నెలలోపు SSC ఫలితాలు విడుదల చేస్తుంది. అందువల్ల, SSC GD ఫలితం 2025ను ఏప్రిల్ నెల మొదటి వారంలో ప్రకటించే అవకాశం ఉంది. ఎంపికైన అభ్యర్థుల వివరాలు ఉన్న PDFను www.ssc.gov.in అనే అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేస్తారు.

SSC GD Result 2025 Release Date

అంశం వివరాలు
సంస్థ పేరు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC)
పోస్టు పేరు కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ)
మొత్తం ఖాళీలు 39,481
పరీక్ష తేదీలు 4వ ఫిబ్రవరి – 25వ ఫిబ్రవరి 2025
ఫలితాల విడుదల ఏప్రిల్ 2025 ప్రారంభం (అంచనా)
ఫలితాల రూపం PDF (రోల్ నంబర్ మరియు కట్ ఆఫ్ తో)
అధికారిక వెబ్‌సైట్ www.ssc.gov.in
తదుపరి దశలు PET, PST, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్

SSC GD Result 2025 Checking Process : SSC GD ఫలితాన్ని ఎలా చూడాలి?

మీ SSC GD ఫలితాన్ని తెలుసుకోవడం చాలా సులభం. ఈ దశలను అనుసరించండి:

  1. ముందుగా SSC అధికారిక వెబ్‌సైట్ www.ssc.gov.in ఓపెన్ చేయండి.
  2. హోమ్ పేజీలో “Results” అనే విభాగాన్ని క్లిక్ చేయండి.
  3. అక్కడ “Constable (GD)” ఫలితాల లింక్ కనిపిస్తుంది.
  4. మీ లింగం (Male/Female)కు అనుగుణంగా సంబంధిత PDF లింక్‌ను క్లిక్ చేయండి.
  5. ఫలితాల PDF తెరచిన తర్వాత Ctrl+F నొక్కి, మీ రోల్ నంబర్ లేదా పేరు టైప్ చేసి వెతకండి.
  6. మీ పేరు కనిపిస్తే, మీరు PET మరియు PSTకు అర్హత సాధించినట్టు.

SSC GD కట్ ఆఫ్ మార్కులు (2025 అంచనా)

పరీక్ష ఫలితాల ప్ర‌కటన‌ సమయంలో SSC GD Cut Off 2025 కూడా విడుదల చేస్తారు. ఇది అభ్యర్థులు ఎంపిక అయ్యారా లేదో తెలుసుకోవడంలో సహాయపడుతుంది.

అంచనా కట్ ఆఫ్ మార్కులు:

కేటగిరీ అంచనా కట్ ఆఫ్ మార్కులు
జనరల్ (UR) 145 – 155
OBC 135 – 145
EWS 138 – 148
SC 130 – 140
ST 120 – 130
మాజీ సైనికులు 60 – 70

SSC GD Contable Resutls Cut Off Marks 2025

ఫలితాల్లో మీ పేరు ఉన్నవారు, తరువాతి దశ అయిన ఫిజికల్ పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుంది. ఇందులో PET (Physical Efficiency Test) మరియు PST (Physical Standard Test) ఉంటాయి. ఈ పరీక్షల నిర్వహణ బాధ్యతను CAPFs చేపడతాయి. PET/PST తేదీలు, ప్రదేశాలు అధికారికంగా త్వరలో ప్రకటించబడతాయి.

PET/PSTలో విజయం సాధించిన అభ్యర్థులు చివరగా డాక్యుమెంట్ల పరిశీలన (Document Verification) కోసం పిలవబడతారు. అన్ని దశలు పూర్తి చేసిన తర్వాత నియామక ఉత్తరాలు జారీ చేస్తారు.

SSC GD కట్ ఆఫ్ PDF Details Included
  • అభ్యర్థి కేటగిరీ వివరాలు
  • కేటగిరీ వారీగా ఎంపికైన అభ్యర్థుల సంఖ్య
  • మొత్తం కట్ ఆఫ్ మార్కులు
  • పార్ట్ A మరియు Bలో పొందిన మార్కులు
  • చివరి ఎంపికైన అభ్యర్థి పుట్టిన తేదీ

SSC GD Resutls 2025 ను ఏప్రిల్ నెలలో విడుదల చేసే అవకాశముంది. అభ్యర్థులు ఫలితాల PDFను జాగ్రత్తగా చెక్ చేసి, PET మరియు PST కోసం సిద్ధంగా ఉండాలి. ఫలితాల విడుదల తేదీ, Merit List, Cut Off మరియు Result Download Link వంటి తాజా సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ www.ssc.gov.in ను తరచూ సందర్శించండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *